న్యాయనిపుణులతో చర్చించి..నిర్ణయం:స్పీకర్

5
- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చాం అని తెలిపారేఉ.

అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు స్పీకర్. పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదు అని… 3 నెలల తర్వాత విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే, స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు.

Also Read:రూ.5కే బ్రేక్ ఫాస్ట్.. ఎప్పటినుండి అంటే!

- Advertisement -