ఇంటికి చేరుకున్న బాలు పార్థివదేహం..

234
spb

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మృతి చెందిని విషయం తెలిసిందే. కొద్దిసేపటి కిత్రమే ఎంజీఎం ఆసుపత్రి నుండి ఆయన పార్థివదేహం చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న ఆయన ఇంటి వద్దకు చేరుకుంది. బాలు అంత్యక్రియలు రేపు చెన్నై సమీపంలోని తామరైపాకంలో ఉన్న ఆయన ఫాంహౌస్‌లో జరగనున్నాయి.

అప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వందలాది మంది అభిమనులు చేరుకున్నారు. కరోనా భయాలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన గాయకుడిని చివరి సారి చూసుకోవాలని పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు.ఆయన ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి.