నింగిలోకి స్పేస్ ఎక్స్..20న రానున్న సునీతా!

16
- Advertisement -

ఈ నెల 20న తిరిగి భూమిపై అడుగుపెట్టనున్నారు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్. ఇందుకు సంబంధించి స్పేస్‌ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు క్రూ-10 మిషన్‌ను ప్రయోగించింది.

స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శనివారం ఉదయం 4.33 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అయితే మూడు రోజుల క్రితం సాంకేతిక సమస్యతో ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే.

అమెరికన్ అంతరిక్ష సంస్థ ఆమెను, వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను తిరిగి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింకిలోకి పంపంది.9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 20 తర్వాత సునీత, బుచ్ భూమికి చేరుకోనున్నట్లు తెలిపింది.

Also Read:Viral Video: యూపీలో దారుణం..షాకింగ్ వీడియో

- Advertisement -