- Advertisement -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. మెమ్ఫిస్ నగరంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఏపీకి చెందిన యువకుడు మోహన్ సాయి తీవ్రంగా గాయపడ్డాడు. కుడి భుజం, చేతిపై బుల్లెట్లు దిగి తీవ్రగాయాలయ్యాయి.
మోహన్ సాయి స్వస్థలం… తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గోవిందపురం పంచాయతీకి చెందిన మోహన్ సాయి అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో మోహన్ సాయి తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మోహన్ సాయి కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read:ప్రజాపాలన కాదు..ప్రజలను వేధించే పాలన: కేటీఆర్
- Advertisement -

