కరోనా కట్టడికి పోలీసుల కృషి: నిర్మల్ ఎస్పీ

232
SP Shashidhar Raju
- Advertisement -

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అంతర్ రాస్ట్ర సరిహద్దు పోలీస్ చెక్ పోస్ట్‌ను జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వలస కార్మికులకు రైళ్లులను ప్రారంభించి వెసులుబాటు కల్పించింది. ఎవరైనా వెళ్లే వారు ఉంటే ముందుగా ఆన్లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ వరకు పంపిస్తామని ఆయన తెలిపారు.

కరోనా వైరస్‌ను కట్టడి కోసం పోలీసు, వైద్య, రెవెన్యూ సిబ్బంది రోడ్లపై అహర్నిశలు విధులు నిర్వహిస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి సిబ్బందికి సూచించారు.

- Advertisement -