మెరుగుపడిన ఎస్పీబీ ఆరోగ్యం..!

191
sp balu
- Advertisement -

కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడింది. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న డాక్టర్లు ఎస్పీబీ ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడిందని చెప్పారు.ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, సామాన్యులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుపడింది. విషమ పరిస్థితి నుంచి కోలుకుంటున్నారు. ఎప్పటిలాగే ఆయన పాటలతో అలరిస్తారని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం‌ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బాలు, 40 ఏళ్ళ మన స్నేహ బంధం ఇంకా ఇలాగే 60 ఏళ్ళు సాగాలి నువ్వు తొందరగా లేచి రావాలి.. నీ ప్రియ మిత్రుడు అశ్వినీదత్ అని పేర్కొన్నారు.

- Advertisement -