దేశం గర్వించే సినిమాలు తీస్తారా..?

244
SP Balasubrahmanyam Sensational Comments
- Advertisement -

వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే గాన గంధర్వుడు,ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం టాలీవుడ్‌ హీరోలపై తీవ్రస్ధాయిలో విరుచకపడ్డారు.జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు పేరు రాకపోవడానికి మన వాళ్లలో అంకిత భావం లేకపోవడమే కారణమన్నారు. రోటరీ క్లబ్ నుంచి జీవిత కాల సాఫల్యపురస్కారం అందుకున్న సందర్భంగా బాలు సంచలన ప్రసంగం చేశారు.

SP Balasubrahmanyam Sensational Comments

అయితే ఈసందర్భంగా బాలు మాట్లాడుతూ…‘లబ్దప్రతిష్టులయిన హీరోలు తెలుగు జాతి కోసం భాష గర్వపడేలా ఒక్క సినిమా తేయలేరా? ఎంత సేపూ కేరళ కర్ణాటక వాళ్లకు అవార్డులు వెళ్లిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కానీ.. ఎంత మంది తమ అభిమాన ఆర్టిస్టులను దేశం గర్వించే సినిమాలు తీస్తారా? అని ప్రశ్నించగలుగుతున్నారా? ‘దంగల్’ సినిమాను ఆమిర్ ఖాన్ ఒక్కడే చేయగలడా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు.. అభిమాని ఆత్మ విమర్శ చేసుకోవాలి.

SP Balasubrahmanyam Sensational Comments

సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకుల్లా మారిపోయింది. సినిమాల్లో నచ్చని అంశంపై నోరెత్తితే ఏ అభిమానులు వచ్చి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తోంది. తమ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే అభిమానులు.. సోకాల్డ్ ఫ్యాన్స్.. ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని ఎందుకు ప్రశ్నించరు? ఈ అభిమానులు తమ ఆర్టిస్టులను ప్రశ్నించగలిగిన రోజే జాతి గర్వించదగ్గ సినిమాలు వస్తాయి. అగ్ర కథానాయకులు కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలి. హీరోలు కనీసం ఒక్క సినిమా అయినా జాతిజజ భాష కోసం చేయాలి.

SP Balasubrahmanyam Sensational Comments

పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు రాష్ట్రంలోని వేల థియేటర్లను ఆ నిర్మాతలు బుక్‌ చేసుకుంటున్నారు. మరి చిన్న సినిమాలను ఎక్కడ ఆడించాలి?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘మిథునం’ సినిమా విషయంలో ఓవర్సీస్‌ నుంచి కూడా తనకు అభినందనలు అందాయని, కానీ రాష్ట్రంలో చూస్తే 10 థియేటర్లకు మించి ప్రదర్శించలేకపోయారని థియేటర్ల ఇబ్బందులపై ఆయన ధ్వజమెత్తారు. చిన్న సినిమా ఎంత హిట్‌ అయినా.. పెద్ద సినిమా విడుదల అయితే చిన్న సినిమాలను తీసి పారేస్తున్నారన్నారు. నచ్చని సినిమాలను ప్రేక్షకులు బహిష్కరణ చేయాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈసందర్భంగా అన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే తెలియని భారతీయ సంగీత ప్రియులు ఉండరు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో గాయకుడిగా ఆరంగేట్రం చేసిన బాలు.. శంకరాభరణం – ఏక్ దూజే కే లియే .. సినిమాలతో టాప్ రేంజ్ గాయకుడిగా ఎదిగారు.

- Advertisement -