సమంతకు వార్నింగ్‌ ఇచ్చిన నాగ్…..

98
Nagarjuna's Warning to Samantha

అక్కినేని వారింట త్వరలో పెళ్లి సందడి మొదలవబోతుంది. అక్కినేని నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య,ఆఖిల్‌ల వివాహాలు చేసుకోబోతున్నారు.. కాగా యాభై ఏళ్ళు దాటిన నాగార్జున ఇప్పటికీ నవ మన్మధుడే… నాగార్జున చిన్న కొడుకు అఖిల్ జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్ ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి విధితమే.. ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించారు..వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా రోమ్ లో జరగబోతున్నది.ఈ పెళ్ళికి ముఖ్య అతిధిలుగా ఓ 150 మంది మాత్రమే హాజరు కానున్నారని… వివాహం అనతరం రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేస్తామని నాగ్ వెల్లడించారు.

Nagarjuna's Warning to Samantha

అయితే ఈ సమయంలో నాగార్జున ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.. ‘‘నన్ను మామయ్య అని పిలవడానికి నా కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో. అఖిల్ కు కాబోయే భార్య శ్రియ భూపాల్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. నన్ను ఆమె నాగ్ మామా అని పిలుస్తుంది. సమంతకే ఈ విషయంలోనే కొంచెం సమస్య. నన్ను ఎలా పిలుస్తావ్.. అని సామ్ ను అప్పుడప్పుడూ అడుగుతుంటా. తనేమో నవ్వేసి ఊరుకుంటుంది. తనను మామూలుగా నాగ్ సార్ అని సమంత పిలుస్తుందని.. ఐతే ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని సమంతకు వార్నింగ్ ఇచ్చినట్లు నాగ్ తెలిపాడు. ఐతే సమంత మాత్రం తనను ఏమని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదని నవ్వేశాడు నాగ్.

Nagarjuna's Warning to Samantha

నాగ చైతన్యతో పెళ్లి ఓకే అయిన తర్వాత తెలుగులో సమంత జోరు తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సమంత మాత్రం కావాలనే తెలుగు సినిమాలకు ఒప్పుకోవడం లేదా…లేక అక్కినేని ఇంటి కోడలుగా వెళ్లే హీరోయిన్‌తో రొమాన్స్‌ చేయడానికి స్టార్‌ హీరోలు ఆసక్తి చూపడంలేదా అనే విషయం మాత్రంపై సందేహం నెలకొంది. ఓ వైపు తమాళంలో వస్తున్న ఆఫర్లును ఓకే చేస్తున్న సమంత…తెలుగులో మాత్రం హీరోయిన్‌ కంటే ఎక్కువగా ప్రత్యేక పాత్రలో కనిపించడానికి ఆసక్తి చూపిస్తోందట.