మొక్కలు నాటి జీవవైవిద్యాన్ని కాపాడుదాం:ఎస్పీ అపూర్వరావు

217
sp apporvarao
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా మొక్కలను నాటి పర్యవరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులతో ఉద్యమంగా కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమములో భాగంగా రాజ్యసభ సభ్యులు ఎంపి,గౌరవ శ్రీ సంతోష్ కుమార్ గారు ప్రవేశ పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె,అపూర్వరావు సోమవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయము ఆవరణలో మొక్కలను నాటి వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు.

అనంతరం జిల్లాలోని పోలీసుఅధికారులకు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ. హారతాహరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోంది. ఇందులో భాగం రాజ్యసభ సభ్యులు యంపీ,శ్రీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడంతో కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని చెప్పారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని ఆమె తెలిపారు.జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లనుగ్రీన్ ఛాలెంజ్ లో హరిత వనాలుగా తీర్చిదిద్దడం లక్ధ్యంగా మొక్కలు పెద్ద ఎత్తున నాటుతున్నామని ఆమె తెలిపారు.ఎస్పీ మేడం గారు పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు.

- Advertisement -