జబర్దస్త్‌కి కొత్త యాంకర్

327
- Advertisement -

బుల్లితెరపై టాప్ రేటింగ్ షో జబర్దస్త్. జబర్దస్త్ వల్ల ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికారు. అయితే కొంతకాలంగా ఒక్కోక్కరుగా జబర్దస్త్‌ను వీడుతుండగా కొంతకాలంగా కొత్త యాంకర్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ కొత్త యాంకర్‌ని తీసుకొచ్చారు జబర్దస్త్ నిర్వాహకులు.

సౌమ్య రావు అనే అమ్మాయిని కొత్త యాంకర్ గా తీసుకొచ్చారు. పలు తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించే సౌమ్య జబర్దస్త్ లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఎపిసోడ్ ప్రోమోలో అదరగొట్టింది. కమెడియన్స్ తో కలిసి కౌంటర్లు, యాంకరింగ్ తో మెప్పించింది.

అయితే కొత్తగా వచ్చిన సౌమ్యకు జబర్దస్త్ యాంకర్‌గా చేయడం ఓ సవాల్‌తో కూడిన పనే. ఎందుకంటే షో నుంచి ఎంతమంది వెళ్లిపోయిన అనసూయ, రష్మి మాత్రం పదేళ్లకు పైగా నాటుకుపోయారు. వీరిద్దరిని మించి చేస్తేనే సౌమ్య ప్రేక్షకులను మెప్పించగలుగుతుంది.

మళ్లీ క్రేజీ కాంబో…సుక్కుతో చెర్రీ!

టీ హబ్‌కు ఏడేళ్లు…

మోడీ యాక్టింగ్ స్కూల్…నవ్వుఆపుకోలేరు!

- Advertisement -