మూడు రోజుల్లో కేరళకు నైరుతి!

5
- Advertisement -

మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.

ఏపీకి మరో రెండు రోజులపాటు వర్ష సూచన ఉండనుండగా తెలంగాణకు మరో నాలుగు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

Also Read:తిరుమల..దర్శన టికెట్ల అప్‌డేట్

ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణాజిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

- Advertisement -