ఇంగ్లాండ్‌పై సఫారీ జట్టు గెలుపు

46
sa
- Advertisement -

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి మూడు వన్డేలో సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 46.5 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్‌ అయింది. జేసన్‌ రాయ్‌(43), జానీ బెయిర్‌ స్టో(63) శుభారంభం అందించగా జో రూట్‌ సైతం 86 పరుగులతో రాణించారు. అయితే బెన్‌ స్టోక్స్‌(5), జోస్‌ బట్లర్‌(12) విఫలమవడంతో ఇంగ్లాండ్ ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ జానేమన్‌ మలన్‌ అర్ధ శతకం(57)తో రాణించగా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాసీ వాన్‌ డర్‌ డసెన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 117 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు ఎయిడెన్‌ మార్కరమ్‌ సైతం హాఫ్‌ సెంచరీ(77)తో చెలరేగాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించడంతో ఇంగ్లండ్ గెలుపు లాంఛనమైంది.

- Advertisement -