తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ అధ్యక్షతన ఇవాళ నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల నేతలు, సీఎంలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఒక రోజు చెన్నై చేరుకున్నారు.
ఇవాళ జరిగే సమావేశం చారిత్రాత్మకమైనదని స్టాలిన్ తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఇదో నాటకమని విమర్శించారు. గతంలో డీఎంకే నేతలు ఉత్తరాది జనాభా పెరుగులపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ మండిపడ్డారు.
చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఈ సమావేశానికి హాజరయ్యే ఏడు రాష్ట్రాల నేతలతో ఏకతాటిపై నిలుస్తామని స్పష్టం చేశారు. మా సీట్లు తగ్గకుండా చూసుకోవడం, మా సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు. స్టాలిన్ ని అభినందిస్తున్నాను.
మార్చి 5న స్టాలిన్, 1971 జనాభా గణాంకాలను ఆధారంగా చేసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలని, తమిళనాడు ప్రాతినిధ్యం 7.18 శాతం తగ్గదని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read:మొబైల్ డేటా..సేవ్ చేసే టిప్స్!