ఎర్రబెల్లిని కలిసిన దక్షిణ కొరియా విద్యార్థులు..

341
errabelli dayakar
- Advertisement -

దక్షిణ కొరియా దేశానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు రెండు నెలలు Education Tourలో భాగంగా ఇండోనేపాల్ (India & Nepal) దేశాలలో పర్యటించిచడానికి వచ్చారు. వీరు మన దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, కొల్ కతా, ముంబై, ఢిల్లీ లాంటి ముఖ్యమైన పట్టణాలలో పర్యటించి ఇక్కడ ప్రజా ప్రతినిధులతో, కొంతమంది అధికారులతో సమావేశమయ్యారు.

మన దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల జీవన విధానం గురించి, అభివృధ్ధి గురించి, పరిపాలన గురించి, రైతులు, కార్మికులు ముఖ్యంగా… విద్యా విదానం, వైద్య విధానం, ప్రభుత్వ సహాయక చర్యలు మొదలైన విషయాలపైన అధ్యయనం చేస్తూ పర్యటిస్తున్నారు.

Errabelli Dayakar Rao

 

వీరంతా ఆదివారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలను ముఖ్యంగా త్రాగునీటి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. మంత్రి దయాకర్ రావును సన్మానించారు. మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ అనుసంధానంతో బిషప్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రాన్ని ఆకు పచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.

- Advertisement -