మూడు ప్రమాదాల్లో సౌత్ సినీ పరిశ్రమ

38
- Advertisement -

ఈ రోజు సౌత్ సినిమా పరిశ్రమను ప్రమాదాలు చుట్టూ ముట్టాయి. అటు కన్నడ, ఇటు మన తెలుగు.. అలాగే మలయాళ సినీ పరిశ్రమలో కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన యువ నటుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రముఖ నిర్మాత పార్వతమ్మ రాజ్ కుమార్ మేనల్లుడు సూరజ్ బైక్‌పై ఊటీకి వెళ్తుండగా నంజన్ గూడు సమీపంలో ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కాలుపై టిప్పర్ వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేసి కాలును తొలగించారు. కాగా, సూరజ్ ‘భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ’ సినిమాలో నటించారు.

అలాగే, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రమాదం జరిగింది. విలయత్ బుద్ద అనే సినిమా షూటింగ్ సమయంలో పృథ్వీరాజ్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన కాలికి దెబ్బ తగలడంతో మైనర్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారట. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ దాదాపు 2-3 నెలలు రెస్ట్ లో ఉండనున్నాడు. ప్రస్తుతానికి షూటింగ్స్ అన్ని వాయిదాపడినట్లు సమాచారం.

Also Read: స్పైలో ఛాలెంజింగ్ రోల్..ఐశ్వర్య

ఇక మన తెలుగు సింగర్ మంగ్లీ ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా బోనాలపై ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తోంది. ఈ షూటింగ్ సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి గాయం అయిందని సమాచారం. దీంతో యూనిట్ వెంటనే మంగ్లీని హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారని, మంగ్లీని కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని తెలిపినట్టు సమాచారం.

Also Read: పవన్ ‘బ్రో’ ఈవెంట్‌.. నిజం ఇదే

- Advertisement -