ఆస్ట్రేలియా రాజధాని మెల్ బోర్న్ వేదికగా ఇటీవలే జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో హైదరాబాదీ అథ్లెట్ అరుణా రెడ్డి కాంస్య పతకం సాధించింది. అయితే అంతటి ప్రతిభ కనబర్చిన అరుణారెడ్డికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ అందించింది.
తాజాగా గ్రూప్ సీ కేటగిరీలో అరుణారెడ్డికి రైల్వే ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటచింది సౌత్ సెంట్రల్ రైల్వే.దీంతో అరుణా ఆనందానికి అవదుల్లేకుండాపోయాయి.
కాగా..రెండురోజుల క్రితమే కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను అరుణారెడ్డి కలిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అరుణారెడ్డికి రూ.2కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేశారు. దేశ గౌరవాన్ని పెంపొందించేలా చేసిన తెలంగాణ బిడ్డను అభినందించి ఘనంగా సత్కరించారు.
Hyderabad: B Aruna Reddy, first Indian to win an individual medal (bronze) at #GymnasticsWorldCup in Australia's Melbourne, given employment in South Central Railway in Group C category #Telangana pic.twitter.com/Ba9o0oaJih
— ANI (@ANI) March 6, 2018