టీమిండియాపై సౌతాఫ్రికా అద్భుత విజయం

2
- Advertisement -

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. టీమిండియా నిర్దేశించిన 252 పరుగుల టార్గెట్‌ను 48.3 ఓవర్లలోనే చేధించగా వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి ఓటమిని చవిచూసింది.

ముఖ్యంగా ఆఖరి ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా బ్యాటర్లు బౌండరీలతో మోత మోగించి మ్యాచ్‌ని మలుపు తిప్పారు. అప్పటి వరకూ భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ నాడిన్ డి క్లార్క్ హిట్టింగ్‌తో ఒక్కసారిగా సౌతాఫ్రికా వైపు తిరిగింది. వరుసగా వికెట్లు పడుతున్నా కెప్టెన్ లారా వోల్వర్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో సౌతాఫ్రికా పతనం ఖాయం అనుకున్న సమయంలో కెప్టెన్ లారా వోల్వర్డ్ 111 బంతుల్లో 8 ఫోర్లతో 70 పరుగులు చేసి అవుటయింది. చివర్లో క్లో ట్రయన్ 66 బంతుల్లో ఐదు ఫోర్లతో 49 పరుగులు చేసి అవుటయింది. డి క్లార్క్ మాత్రం ఆఖర్లో సిక్సర్లతో టీమిండియా బౌలర్లను బెంబేలెత్తిచ్చింది. వరుస సిక్సర్లు, ఫోర్లతో ఓడిపోయే మ్యాచ్‌ని గెలిపించింది. 54 బంతులు ఆడిన డి క్లార్క్ ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్‌గా మ్యాచ్ విన్నర్‌గా నిలిచింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావెల్ – స్మృతి మంధాన శుభారంభం అందించినప్పటికీ ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకానొక సమయంలో 150 పరుగులకే ఆలౌట్ అవుతుంది అని అనుకోగా రిచా ఘోష్ 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు,స్నేహా రానా కూడా 24 బంతుల్లో 33 పరుగులు చేసి చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

Also Read:Dude Trailer:‘డ్యూడ్’ ట్రైల‌ర్

- Advertisement -