బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 32 రోజులు పూర్తి చేసుకుంది. ఐదోవారం ఎండింగ్‌కు రాగా ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
తొలుత తనూజని పక్కకి తీసుకెళ్లి భరణి కాసేపు మాట్లాడాడు. పరిస్థితులు ఒక్కోసారి ఎలా అయిపోతాయంటే మనల్ని బాగా చూసుకునే వ్యక్తి మనల్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది.. అది నిజం కాదు అని వేదాంతం చెప్పాడు. తనూజ ఒక్కటైతే నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా.. ఈ హౌస్‌లో నువ్వంటే నాకు చాలా ఇష్టం.. పోని ఎవరైనా నీ దగ్గరికొచ్చి ఏమైనా చెప్పినా స్ట్రాంగ్‌గా చెప్పు మా నాన్నకి నేనంటే చాలా ఇష్టమని చెప్పు అని భరణి అనగా అదే చెప్తున్నాను అని తనూజ రిప్లయ్ ఇచ్చింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇప్పటివరకూ నేను ఇచ్చిన టాస్కులు ఆడి మీరు చాలా అలసిపోయినట్లున్నారు కదా కానీ ఇప్పుడు ఫుల్ ఎంటర్‌టైన్ అయ్యే సమయం వచ్చింది అని చెప్పాడు. నాచోరే నాచోరే అనే టాస్క్ ఇచ్చి.. ఈ టాస్కులో గెలవడానికి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన గోడ వెనకాల నిలబడి మ్యూజిక్ వస్తున్నంత సేపు డ్యాన్స్ చేసి మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ హోల్స్‌లో నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటికి రావాలి.. ఏ సభ్యుడైతే నేను చెప్పిన కలర్ హోల్ నుంచి ఎక్కువసార్లు ముందుగా బయటికి వస్తారో వాళ్లు ఈ టాస్కులో విజేతలు అవుతారు అని చెప్పాడు. ఒక రౌండ్‌లో గెలిచిన జంట తర్వాతి రౌండ్స్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఫస్ట్ రౌండ్‌లో కళ్యాణ్ ముందుగా కన్నంలోకి దూరి బయటికి రాబోయాడు. కానీ వెనకాల నుంచి భరణి.. కళ్యాణ్ ప్యాంట్ పట్టుకొని లాగేయడంతో ఇబ్బంది అయిపోయింది.
కళ్యాణ్ ప్యాంట్ వదిలేసి మరీ బయటికి దూకేశాడు. ఈ టాస్క్‌లో కళ్యాణ్ మొత్తానికి విన్ అయ్యాడు. తర్వాతి రౌండ్‌లో దివ్య విన్ అయింది . చివరి రౌండ్‌లో సుమన్ శెట్టి గెలిచారు.
ఈ టాస్కు ముగిసేసరికి లీడర్ బోర్డ్‌లో భరణి-దివ్య టాప్‌లో ఉన్నారు. దీంతో వీళ్లకి బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు. మొదటి స్థానంలో ఉన్న భరణి-దివ్యకి నేను ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నా.. దీంతో బాటమ్ టూ జంటలైన సంజన ఫ్లోరా, శ్రీజ-సుమన్‌లో నుంచి వారు సాధించిన పాయింట్లతో సంబంధం లేకుండా మీ కారణాలతో ఒక జంటని ఎంపిక చేసి ఈ రేసు నుంచి తొలగించండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంతా ఊహించినట్లే సంజన-ఫ్లోరా టీమ్‌ని తీసేద్దామనుకుంటున్నాం అని భరణి-దివ్య చెప్పారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసేసరికి భరణి, దివ్య, కళ్యాణ్, కెప్టెన్ రాము, ఇమ్మూ మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నారని… మిగిలిన వాళ్లంతో డేంజర్ జోన్‌లోనే ఉన్నారని బిగ్‌బాస్ చెప్పాడు.
Also Read:Dude Trailer:‘డ్యూడ్’ ట్రైలర్

