- Advertisement -
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 39వ అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొడుకు జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారిగా బాధ్యతులు స్వీకరించారు. గంగూలీ 13 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.
టీమిండియాని ఫిక్సింగ్ కుంభకోణం కుదిపేస్తున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన దాదా.. జట్టుని ఒక తాటిపైకి తేవడంలో విజయవంతమయ్యాడు. భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాలను అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తం 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు గంగూలీ.
- Advertisement -