బెస్ట్ కెప్టెన్‌ ఇలా ఉండాలి: దాదా

377
ganguly
- Advertisement -

ఉత్తమ కెప్టెన్ లక్షణాలు ఎలా ఉండాలో చెప్పాడు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ. నాయకులలో గొప్పవారు తప్పులు చేస్తారు కానీ ఆ తప్పుల నుండి నేర్చుకోవాలి …అది ఎదగడానికి ఒక భాగం కావాలన్నారు. వైఫల్యాల నుండి నేర్చుకోవడం మిమ్మల్ని విజయానికి దారి తీస్తుందని చెప్పుకొచ్చారు.

నాయకత్వ లక్షణాలలో అనుకూలత ఒకటన్నా గంగూలీ….. నాయకుడు జట్టు సభ్యుల సహజ ప్రతిభను కనుకోవాలి…అప్పుడే ఉత్తమ ఫలితాలను రాబట్టవచ్చన్నారు. ఇందుకో ఉదహరణ చెప్పిన దాదా రాహుల్ ద్రవిడ్ ను యువరాజ్‌గా చేయలేరు…అలాగే యువరాజ్‌ను ద్రాడిగా మార్చలేరు. ఒక్కో ఆటగాడికి ఒక్కో లక్షణం ఉంటుంది దానిని జట్టు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటేనే నాయకత్వ ప్రతిభ భయటపడుతుందన్నారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు కూడా మార్పులకు అనుగుణంగా ఉండగలగడం నాయకుడి యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి అని తెలిపాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ తర్వాత టీమిండియాను అజేయశక్తిగా మార్చడంలో గంగూలీ ప్రతిభ అమోఘం. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా తిరిగి క్రికెట్‌కు ఆదరణ లభించేలా చేయడంలో దాదా శక్తివంచన లేకుండా కృషిచేశారు.

- Advertisement -