భారీ బడ్జెట్‌తో దాదా బయోపిక్..!

57
sourav ganguly

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్‌ జట్టు గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన దాదా…జట్టును సమర్ధవంతంగా విజయతీరాల వైపుకు నడిపించి పూర్వవైభవం తీసుకొచ్చారు.

ప్రస్తుతం బీసీసీఐ చీఫ్‌గా ఉన్న దాదా బయోపిక్‌…త్వరలో రానుంది. దాదా బయోపిక్‌ను దాదాపు సుమారు రూ.250 కోట్లతో నిర్మించనున్నట్లు వార్తలు వెలువడుతుండగా రణబీర్ లీడ్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది.

తన బయోపిక్‌ వార్తలపై స్పందించారు గంగూలీ. బయోపిక్‌కి అంగీకారం తెలిపాను. మూవీ హిందీలో రూపొందనుంది. అయితే హీరో, డైరెక్టర్ ఎవరు..? అనే విషయాల్ని మాత్రం ఇప్పుడే చెప్పలేను. అధికారికంగా పూర్తి వివరాలు తెలియడానికి కాస్త సమయం పడుతుందని వెల్లడించారు దాదా. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ సూపర్ హిట్‌గా నిలవగా.. 1983 వరల్డ్‌కప్‌‌పై తీసిన ‘83’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.