రజనీకాంత్‌ కూతురికి మళ్లీ పెళ్లి..!

237
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చిన్న‌ కుమార్తె సౌంద‌ర్య 2010లో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్ళ త‌ర్వాత‌ వారి ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరి కుమారుడు వేద్‌ కృష్ణ సౌంద‌ర్య ద‌గ్గ‌రే ఉంటున్నాడు.

Soundarya Rajinikanth

ఇక అసలు విషయానికొస్తే.. సౌందర్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారట. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య పెళ్లాడబోతున్నారట. గతేడాది సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 11న పెళ్లి జరగనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వీరి వివాహాన్ని గ్రాండ్‌గా జరిపించనున్నట్లు తెలుస్తోంది. మెహెందీ, సంగీత్‌ కార్యక్రమాలతో కలిపి మూడు రోజుల పాటు వివాహ వేడుక ఉండబోతోందట. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే తలైవా నివాసంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది.

- Advertisement -