- Advertisement -
చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ పరమపదించారు అనే వార్త అత్యంత బాధాకరం. వారి మృతి పట్ల RSS తెలంగాణ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది.
సౌందరరాజన్ కేవలం ఆలయ అర్చకులు మాత్రమే కాదు; వారు ఒక గొప్ప పండితులు, విద్యావేత్త మరియు అసాధారణమైన న్యాయ నిపుణులు. చిలుకూరు బాలాజీ ఆలయానికి నేడున్న దేశవ్యాప్త గుర్తింపు వెనుక వారి కృషి వెలకట్టలేనిది.
Also Read:Ind Vs Wi:మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే?
ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం పైన, ధార్మిక సంస్థల స్వయంప్రతిపత్తి కోసం వారు చేసిన అలుపెరగని న్యాయపోరాటం చిరస్మరణీయం. సామాన్యులకు భక్తిని చేరువ చేయడంలో, హిందూ ధర్మ ప్రచారంలో వారు పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకం.
- Advertisement -

