సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్, ఫాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్, సోమవారం విడుదలైంది. ’సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో..విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో…సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో’ అనే పల్లవితో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీమెలోడీగా ఉంది.
ఎమోషనల్‌గా సాగుతూనే సినిమాలోని ప్రధాన పాత్రల భావోద్వేగాలను చాల బలంగా ఎస్టాబ్లిష్ చేస్తోంది. ముఖ్యంగా చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలలో రూపొందించిన వీడియో, మహేష్ బాబు, విజయశాంతి మధ్య వచ్చే సీన్లు, సెట్లో టీమ్ చేసే సందడి అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్‌తో సాంగ్‌ను చక్కగా తీర్చిదిద్దారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ క్లాసీ సాంగ్ లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి. ప్రాక్ గానం ఫ్రెష్ ఫీల్‌ను కలిగిస్తుంది.
‘సరిలేరు నీకెవ్వరు’టీం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ’సూర్యుడివో చంద్రుడివో’పాటతో ఆల్ మాస్, క్లాస్ ఆడియన్స్, సూపర్ స్టార్ ఫాన్స్‌కి ఫీస్ట్ గా సంక్రాంతి ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11,2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’విడుదల కానుంది.
Superstar Mahesh’s out and out entertainer ‘Sarileru Neekevvaru’ Presented by Dil Raju in Sri Venkateswara Creations banner, Produced by..