భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత..

538
drugs
- Advertisement -

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. కుషాయిగూడలో మాదకద్రవ్యాలు తరలిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి 150 గ్రాముల బ్రౌన్‌ హెరాయిన్‌, 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన కీసర, జవహర్ నగర్, కుషాయిగూడ పీఎస్ పరిధిలో ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ముఠా రేవ్ పార్టీలు, పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మరి కొద్ది రోజుల్లో న్యూ ఇయర్ పార్టీల కోసం డ్రగ్స్‌ను ఈ ముఠా హైదరాబాద్‌కు తెచ్చినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -