3డీ ప్రింటింగ్ లో అగ్ర‌గామిగా తెలంగాణ‌

111
KTR
- Advertisement -

హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో మెడిక‌ల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సులో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ రంగంలో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. ఇప్ప‌టికే టీ హ‌బ్‌లో 3డీ ప్రింటింగ్ ప్ర‌త్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు. అనేక ప్రోటో టైప్స్ ని టీ వ‌ర్క్స్ ద్వారా తయారుచెస్తున్నామని తెలిపారు.

నూతన సాంకేతిక‌త‌లో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలిపే ల‌క్ష్యంలో భాగంగా 3డీ ప్రింటింగ్‌పై దృష్టి పెట్టామన్నారు. దీని ద్వార రోగుల‌కు వైద్య సేవ‌ల‌ను,స‌ర్జ‌న్లు మ‌రింత మెరుగ్గా అందించే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌న్నారు. ఆర్థోపెడిక్, డెంట‌ల్‌తో పాటు మొదలగు డిపార్ట్మెంట్ రోగుల్లో ఇంప్లాంట్ల‌కు డిమాండ్ పెర‌గ‌డం ఈ రంగం అభివృద్ధికి ప్ర‌ధాన కార‌ణం అని ప్రస్తావించారు.

అమెరిక, ఐరోపా మార్కెట్ల‌లో ఈ సాంకేతిక‌త ఇప్ప‌టికే చాలా డెవలప్ అయ్యిందన్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌కు ఈ రంగంలో ఎదిగేందుకు మంచి అవ‌కాశ‌ముంద‌న్నారు. త్వరలో ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అడిట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సెంట‌ర్‌తో, ఈ రంగంలో దేశం పురోగ‌తి సాధిస్తుంద‌ని పేర్కొన్నారు. ఆర్థికంగా హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ మార్కెట్ విలువ రెండు సంవత్సరాల క్రితం 1.7 బిలియ‌న్ డాల‌ర్లు కాగా, రానున్న ఐదు సంవత్సరాల లో ఇది 7.1 బిలియ‌న్ల‌కు చేరుతుంద‌ని ఊహించారాయన.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో వివిధ సంస్థ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందాలు చేసుకున్నాయి.

- Advertisement -