నిర్మాతగా మారిన సోనుసూద్!

37
sonu sood

నటుడు సోనూ సూద్ నిర్మాతగా మారారు. త‌న తండ్రి శ‌క్తి సాగ‌ర్ సూద్ పేరు మీద నెల‌కొల్పిన శ‌క్తిసాగ‌ర్ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. స్పూర్తిని క‌లిగించే క‌థ‌ల‌తో సొంత బ్యాన‌ర్ లో సినిమాలు తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు చెప్పాడు.

ప‌లువురు డైరెక్ట‌ర్లు సోనూసూద్ తో క‌లిసి పనిచేసేందుకు రెడీగా ఉన్న‌ట్టు టాక్‌. సోనూసూద్ నిర్మించే చిత్రాల బడ్జెట్ కూడా ఎక్కువే ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ లో కీ రోల్ చేస్తున్నాడు సోనూసూద్‌. క‌మ‌ర్షియ‌ల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల కానుంది.

లాక్ డౌన్ లో విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ల‌క్ష‌లాది మందికి అండ‌గా నిలిచి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు సోనూ‌. ఆయన చేసిన సేవలను యావత్ భారతం గుర్తుంచుకుంది.