కేశవపురంలో రైతు వేదికను ప్రారంభించిన ఎర్రబెల్లి..

27
dayakar

ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతి అని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాయపర్తి మండలంలోని కేశవపురంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, కాట్రపల్లి లో రైతు వేదిక,పల్లె ప్రకృతి వనం, మొరిపిరాల(అర్ & అర్ కాలనీ) లో రైతు వేదిక నిర్మాణ పనులను ప్రారంభించారు.

మన రాష్ట్రంలో రైతుల కోసం అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో, మరే రాష్ట్రం లోనూ అమ‌లు కావ‌డం లేదన్నారు ఎర్రబెల్లి. సాగునీరు, ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి, రుణాల మాఫీ, పంటల కొనుగోలు… ఇలా 18 రకాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు.

రైతాంగానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రం 10వేల కోట్ల సబ్సిడీ ఇస్తుంది….ఈ దశలో కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నేతృత్వంలో జరుగుతున్న‌ద‌ని తెలిపారు.