మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) ఎన్నికలు రోజుకో సినిమా ట్విస్ట్‌ను తలపిస్తున్నాయి. ఇప్పటికే బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ మధ్య మాటల యుద్దం నడుస్తుండగా బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎస్ నరసింహరావు ప్యానెల్ ఉన్నాయి.
అయితే తాజాగా ప్రస్తుతం మరో ఆసక్తికర, బ్రేకింగ్ వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. కరోనా ఆపదసమయంలో అడిగిన వారికి లేదనకుండా సాయం అందిస్తూ దేవుడిగా మారిన రియల్ హీరో సోనూసూద్ కూడా మా ఎన్నికల బరిలో దిగనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు పోటీగా సోనూసూద్ ను రంగంలోకి దింపేందుకు కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నట్లుగా టీ టౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక మా ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు ప్రయత్నిస్తుండగా ప్రకాశ్ రాజ్, నరేష్ మధ్య మాత్రం మాటల యద్దం ఆగడం లేదు. మొత్తంగా సాధారణ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల్లో ఇంకెన్ని ట్విస్ట్‌లుంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.