సెల్యూట్ సోనూ..

131
sonu
- Advertisement -

సోనూ సోద్…కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి వినిపించిన పేరిది. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానంటూ సహాయక కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతిగా సాగుతున్న వేళ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటుచేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ.

సోనూ సాయానికి ఎల్లలు లేవు. తన పేరుమీదే సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్చంద సంస్థ ప్రారంభించి సేవలను విస్తృతం చేశారు. తాజాగా పేద విద్యార్థులకు అండగా నిలబడ్డారు సోనూ. ఐ.ఎ.య‌స్ (IAS) చ‌ద‌వాల‌నుకునే పేద విద్యార్థుల కోసం త‌న ఫౌండేష‌న్ ద్వారా స‌హాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయన.. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్‌గా (CA) మారాల‌నుకునే పేద విద్యార్థుల‌కు అండ‌గా నిలబడతానని హామీ ఇచ్చారు. సూద్‌ చారిటీ ఫౌండేష‌న్‌ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.

సోనూ చేస్తున్న ఈ సేవలు చూసి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అతడే రియల్ హీరో అని పొగుడుతున్నారు. సాయం కోరిన వారికి అండగా నిలుస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సోనూకి నిజంగా సెల్యూట్.

- Advertisement -