రవిబాబు ‘క్రష్’ వర్కవుట్ అయ్యేనా…!

172
ravibabu
- Advertisement -

సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించిన రవిబాబు..తాజాగా అడల్ట్ కామెడీ మూవీ ‘క్రష్’తో రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ అడల్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ‘క్రష్’ అనే టైటిల్‌తో వస్తున్న ఆయన, అదే రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కాళ్లపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకుంటున్న అమ్మాయిని, డోర్ పక్కనే ఉండి మాస్క్ ధరించి అదంతా చూస్తున్న ముగ్గురు అబ్బాయిలను చూపిస్తూ గతంలో పోస్టర్స్వదిలిన రవిబాబు ఈ సారి ఏకంగా మూడు జంటలను నగ్నంగా బందీ చేసిన ఫొటో రిలీజ్ చేశారు.

అర్థనగ్న సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నానా హంగామా చేసేసింది. జీ 5 సంస్థతో ఒప్పందం చేసుకొని జూలై 9వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు.

- Advertisement -