ఏసర్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ!

140
sonu sood

కరోనా లాక్ డౌన్ సమయంలో పెద్దమనసు చాటుకున్నవ్యక్తి సోనూ సూద్. తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్న సోనూ…దేశంలో రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూ సూద్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది.

ప్రముఖ ల్యాప్ టాప్ సంస్ధ ఏసర్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఏసర్‌లో ఉన్న సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తారని సంస్థ తెలిపింది.

మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్‌ సాంకేతికతతో ఏసర్‌ ఇండియా అకట్టుకుంటుందని ఆ సంస్ధ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏసర్‌ ఇండియా 1976లో స్థాపించబడగా ప్రస్తుతం160 దేశాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.