- Advertisement -
కరోనా కష్టకాలంలో వలసకార్మికులు,ప్రవాస భారతీయులను వారి స్వస్థలాలకు చేరుస్తూ పెద్ద మనసు చాటుకున్న నటుడు సోనూసూద్ తన 47వ బర్త్ డే సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు.
ప్రవాసీ రోజ్ గార్ పోర్టల్ ద్వారా 3 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన సోనూ…ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమానికి తనతో భాగస్వామ్యం అయిన సంస్థలకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక ఇప్పటికే రాష్ట్రం ఏదైనా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ సోషల్ మీడియాలో రియల్ హీరోగా మారిపోయారు సోనూ. కోట్లాదిమంది హృదయాలను తన సేవాతత్పరతతో దోచుకున్న సోనూపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి.
- Advertisement -