సోనుసూద్‌కు అరుదైన గౌరవం…

112
Sonu Sood

సినీనటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సోనూ చేసిన సేవలను గుర్తిస్తూ పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమించింది భారత ఎన్నికల సంఘం. కరోనా లాక్ డౌన్ సమయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని తమ స్వస్థలాలకు పంపడంలో విశేష కృషిచేశారు.

పంజాబ్‌ రాష్ట్రంలోని మోగా జిల్లా కరోనా వైరస్‌ ప్రేరేపిత లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా సోనును నియమించింది ఈసీ.

పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు రప్పించేందుకు సైతం సొంత ఖర్చులతో విమానాలను సైతం ఏర్పాటు చేయించారు సోనుసూద్. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం,పేద పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్‌లు.. వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డీపీ) ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది.