కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు రాష్ట్రాలు సొంత స్టిక్కర్లు వేసుకుంటే ఆయా పథకాలను ఆపేస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హెచ్చరించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు సమాధానిమిచ్చారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌తో సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, పీఎం జన్ ఆరోగ్య యోజనల ద్వారా అందిస్తోన్న వైద్యసేవల పథకాలను రాష్ట్రాల్లో వేరే పేర్లతో అమలు చేస్తున్నారు.
ఇటీవల వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ ఏపీలో పర్యటించినప్పుడు కొన్ని లోపాలను గమనించారని వాటిని నివృత్తి చేసే విధంగా వివిధ రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లేఖలు రాసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 60శాతం నిధులు కేటాయిస్తున్న ఈ పథకాలకు కేంద్రం పేరే లేకుండా అమలు చేయడాన్ని అనుమతినివ్వబోమని తెలిపారు. కేంద్రం అందించే నిధులతో ఏర్పాటు చేస్తున్న పథకాలను ప్రజలకు వెళ్లేలా చూడాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి…