ఇక తెరపైకి సోనియా గాంధీ లవ్‌ స్టోరీ..!

160
Sonia-Rajiv Gandhi's brave love story
- Advertisement -

బాలీవుడ్ లో బయోపిక్ లు కామన్‌ అయిపోయాయి. ఈ బయోపిక్ లలో ప్రముఖ వ్యక్తుల్లోని గొప్పదనంతోపాటు వారి రహస్యాలూ బయటపడే సందర్భాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే తాజాగా రాజీవ్ – సోనియాగాంధీల లవ్ స్టోరీపై సినిమా తీస్తున్నారట. సోనియా – రాజీవ్ ల స్టోరీ అనగానే రాజకీయాలు వంటి ఎన్నో అంశాలు సహజంగానే గుర్తొస్తాయి. కానీ ఇందులో అలాంటివి ఏమీ ఉండవట. కేవలం వారి లవ్ స్టోరీ మాత్రమే ఉంటుందట.

  Sonia-Rajiv Gandhi's brave love story

రాజీవ్ – సోనియాల మధ్య పరిచయం ఎలా జరిగింది.. ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడింది.. పెళ్లి వరకు అది ఎలా వెళ్లింది.. పేరెంట్స్‌ ను ఎలా ఒప్పించారు వంటి ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ సినిమా రూపొందిస్తున్నారట. ఈ సినిమా మార్చిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతలు దీన్ని మార్కెట్ చేసుకోవడంలో కూడా మంచి ప్లానే వేశారు. ఈ సినిమాని ఇంగ్లీష్ తో పాటు సోనియా సొంత దేశమైన ఇటలీ ప్రజలకు నచ్చేలా ఇటాలియన్ లాంగ్వేజిలోనూ దీన్ని రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా…ఈ ప్రముఖ నేతల పాత్రల్లో రాజీవ్ గా బుల్లితెర నటుడు కరణ్ వీర్ బోరా – సోనియాగా ప్రియా బెనర్జీ నటిస్తున్నారు. సినీ ప్రముఖులు కపుల్స్ గురించి చాలా సినిమాలు వచ్చినా రాజకీయ నాయకుల లవ్ స్టోరీలపై మాత్రం ఇప్పటివరకు సినిమాలు రాలేదు. కాగా ఈ సినిమాకు ‘ఇజాజత్’ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమా గురించి చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే… ఈ బయోపిక్ నిడివి గంట నుంచి గంట 20 నిమిషాల మధ్య ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇప్పటివరకు రాజకీయాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ప్రేక్షకులకు సోనియా – రాజీవ్ ల స్టోరీ ఏ రేంజ్‌ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -