సినిమాల ఎంపికలో ఆ హీరో హస్తం….!

293
- Advertisement -

మలయాళీ సుందరాంగి అనుపమా పరమేశ్వరన్ పేరు టాలీవుడ్‌లో మారుమోగొతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలోని అ..ఆ చిత్రంలో నితిన్‌ సరసన నటించింది అనుపమ. ఆ తర్వాత ‘నాగచైతన్య’ తో ప్రేమమ్ రీమేక్ లో నటించి తెలుగు యూత్ కి మరింత దగ్గరైంది ఈ మళయాల బ్యూటీ. ఇటీవలే వచ్చిన శతమానం భవతిలో శర్వానంద్‌ సరసన నటించి మంచి మార్కులు కొట్టెసింది ఈ అమ్మడు. ఇప్పటికి ఈమూవీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
 Anupama To Romance Sharwanand
అయితే తాజాగా అనుపమా పరమేశ్వరన్ గురించి ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుపమా,శర్వానంద్ వీరిద్దరూ ఇప్పటికే చాలా క్లోజ్‌ అయ్యారనీ, ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందనీ ఫిల్మ్‌ సర్కిల్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాల ఎంపికలో  ఈ హీరో సలహాలు, సంప్రదింపులు తీసుకుంటోందట ఈ మళయాళీ బ్యూటీ. అంతేకాకుండా ఈ బ్యూటీ శర్వానంద్‌తో డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
 Anupama To Romance Sharwanand
అయితే సినిమాల విషయంలో అనుపమా, శర్వానంద్‌ సలహాలు తీసుకుంటుదట అందుకుగాను ఇటీవలే రెండు సినిమాలను వదులుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలను వదులుకోవడానికి తన రెమ్యునరేషన్‌ కారణమని టాలీవుడ్‌లో గాసిప్స్‌ వచ్చినప్పటికీ, అసలు విషయం మాత్రం దీని వెనుక ఈ హీరో హస్తం ఉందనీ, అందుకే అతగాడి సలహా మేరకే ఆ సినిమా వదులుకుందనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే శతమానం భవతిలో జంటగా నటించిన వీరిద్దరి మధ్య బాగానే చనువు ఏర్పడిందని అందుకోసమే ఇలాంటి సలహాలు తీసుకుంటుదని చెబుతున్నారు అనుపమా సన్నిహితులు. ఏది ఏమైనప్పటికీ ఈ వార్త విన్న నెటిజన్లు మాత్రం ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది అని వ్యాఖనిస్తున్నారు. అనుపమా అభిమానులు మాత్రం వచ్చిన ప్రాజెక్ట్స్‌లో సరైన ప్రాధన్యం లేకపోవడం వల్లే ఆ సినిమాను వదులోకొవల్సి వస్తుందని చెబుతున్నారు.

- Advertisement -