- Advertisement -
కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. దేశవ్యాప్తంగా వలసకూలీలను ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో వారి స్వస్థలాలకు తరలిస్తుండగా వారినుండి టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన సోనియా గాంధీ..వలస కూలీల టికెట్ ఛార్జీలను తాము భరిస్తామని ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల పీసీసీలు అన్ని చర్యలు తీసుకుంటాయని చెప్పారు.
విపత్కర సమయంలో వలస కూలీల సేవలో ఇదో చిన్న సాయంగా భావిస్తున్నామని చెప్పారు. సంక్షోభ సమయంలో కూలీల నుంచి టికెట్ చార్జీలు వసూల్ చేయడం దారుణమని సోనియా అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ ఈవెంట్‌కు జనాలను తీసుకువచ్చేందుకు వంద కోట్లు ఖర్చు చేశారని కానీ కూలీలను తరిలించేందుకు వారి నుంచి టికెట్ ఛార్జీ వసూల్ చేయడం హేయంగా ఉందన్నారు.
- Advertisement -