- Advertisement -
కరోనా నేపథ్యంలోప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్ధితులో చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై చర్చించనున్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు 18 పార్టీలను సోనియా ఆహ్వానించారు. డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు పాల్గొననున్నారు. ప్రధానంగా వలస కార్మికుల సమస్యలు, రాష్ట్రాలు కార్మిక చట్టాలను నిలిపివేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు.
- Advertisement -