విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’.ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. రిలీజ్‌కు ముందు టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్ అయింది? మోహన్ బాబు ఈ సినిమాతో అంచనాలు అందుకున్నారా? అనే విషయాలు తెలుసుకుందాం..!
కథ: విరూపాక్ష (మోహన్ బాబు ) ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. చాలా సాధారణ జీవితం లీడ్ చేస్తూ తన కుటుంబమే సర్వంగా బతుకుతుంటాడు ఆయన. అలాంటి ఆయన జీవితం ఒక రాజకీయ నాయకుడి ( పోసాని కృష్ణమురళి) కారణంగా నాశనమవుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్యాకూతుళ్లని పోగొట్టుకుంటాడు. తాను చేయని తప్పుకు జైలు పాలవుతాడు. ఆ తర్వాత విరూపాక్ష తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ఎలా పగతీర్చుకుంటాడు? సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఎలా స్పందించాడు అన్నదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ : విరూపాక్షగా మోహన్ బాబు నటన ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇందులో కులాల గురించి చెప్పే డైలాగ్లోనూ, పొలిటికల్ సెటైర్స్ పేల్చడంలోనూ తన మార్కు చూపించారు.
మైనస్ పాయింట్స్ : రొటీన్ కథను మరింత రొటీన్‌గా దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పక తప్పదు. కథాకథనాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా సాగుతాయి.
సాంకేతిక విభాగం : లిమిటెడ్ బడ్జెట్ కు తగ్గట్టుగానే ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి. అలాగే పలు బోరింగ్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని తగ్గించేశాయి. అలాగే ఇళయరాజా సంగీతం ఒక్క పాటకే పరిమితమైంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే వారిచేత చేయించారని అర్ధమవుతుంది.
తీర్పు : మొత్తం మీద మోహన్ బాబు చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ తెరపై కనిపించడానికి చేసిన ప్రయోగం.. తీసిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’.
విడుదల తేదీ : 18/02/ 2022
రేటింగ్ : 2
నటీనటులు : మోహన్ బాబు, మీనా
సంగీతం : ఇళయరాజా
నిర్మాత : మంచు విష్ణు
దర్శకత్వం : డైమండ్ రత్నబాబు