కొడుకు ఫెయిల్ అయితే… తండ్రి పార్టీ ఇచ్చాడు..

262
Son fails 10th exams and father surprise party in Madhya Pradesh
- Advertisement -

పిల్లలు ఫెయిల్ అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారు. తిడతారు, మరికొందరు కొడతారు. లేదంటే వాళ్ల చదువు ఇంతకే రాసి పెట్టి ఉంది ఏం చేస్తాం అంటూ వదిలేస్తారు. కానీ మధ్యప్రదేశ్ కి చెందిన ఓ తండ్రి మాత్రం ఇందుకు భిన్నంగా చేశాడు. తన కుమారుడు 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడని తెలుసుకుని చుట్టు పక్కల వాళ్లని, బంధువులని పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు. కొడుకు ఫెయిల్ అయితే మందలించాల్సింది పోయి తండ్రి పార్టీ ఇవ్వడం ఏంటని అందరూ ఆ అబ్బాయి ఇంటికి పరుగులు తీశారు.

Son fails 10th exams and father throws surprise party in Madhya Pradesh

బోపాల్ కి చెందిన సురేంద్ర కుమారుడు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు ఈ విషయం తెలుసుకున్న తండ్రి, ఇంటి ముందు టెంటు వేసి బంధువులను, సన్నిహితులను, చుట్టు పక్కల వాళ్లని పిలిచి వారికి స్వీట్లు పంచాడు. అంతేకాదండోయ్ ఆ ఆనందంలో టపాసులు కూడా పేల్చాడు. అక్కడి వచ్చిన వారంతా సురేంద్ర చేసే పనులను చూసి ఆశ్చర్యపోయారు. కొడుకు ఫెయిల్ అయితే పార్టీ ఇవ్వడం ఏంటి అని సురేందర్ ని అడిగారు.

అందుకు సురేంద్ర ‘ ఫలితాలు ముఖ్యం కాదు. మా అబ్బాయి ముఖ్యం. అయినా మా అబ్బాయి చదవనందుకు ఫెయిల్ అవ్వలేదు, వాడు చాలా కష్టపడాడు. అయినా.. చదువు ఒక్కటే జీవితం కాదు. అంతకు మించి జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యాడని కొట్టాననుకోండి వాడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నేను తట్టుకోలేను. అందుకే పార్టీ ఇచ్చి వాడిని పోత్రహిస్తున్నాని సురేందర్ అన్నాడు.

ఈ మధ్య పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్లందరికి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. పరీక్షలు ఒక్కటే జీవితం కాదు. జీవితంలో నేర్చుకోవాల్సంది చాలా ఉంది అన్నారు. నా కుమారుడు ఈ ఏడాది ఫెయిల్ అయితే వచ్చే ఏడాది పాస్ అవుతాడని సురేందర్ చెప్పారు. అయితే సురేందర్ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. అందరి పిల్లల తల్లిదండ్రులు సురేందర్ వలె ఆలోచించాలని నెటజన్లు సోషల్ మీడియాలో  కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -