బీజేపీలో మార్పు..సోము వీర్రాజు ఔట్?

72
- Advertisement -

ప్రస్తుతం బీజేపీ చాలా రాష్ట్రాలలో ప్రక్షాళనపై గట్టిగానే దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, మద్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అధ్యక్ష పదవి మార్పుపై అధిష్టానం ముమ్మర కసరత్తులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తెలంగాణలో అధ్యక్ష మార్పుపై రాజకీయ వేడి తారస్థాయిలో కొనసాగుతోంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే వేడి రాజుకుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. ఈయన నాయకత్వంపై ఏపీ బీజేపీ నేతల్లో గత కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. దాంతో సోము వీర్రాజు ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆ దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. .

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు ఉండడంతో పార్టీని బలోపేతం చేయాలంటే సరైన నాయకత్వం తప్పనిసరి. అందుకే సోము వీర్రాజు స్థానంలో ఇంకొకరిని నియమించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మద్యనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో బీజేపీ నేత సత్యకుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

Also Read:బీజేపీకి మరో షాక్.. రఘునందన్ గుడ్ బై ?

దాదాపు సత్యకుమార్ ను అద్యక్షుడిగా అధిష్టానం కన్ఫర్మ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సోము ను తప్పించి ఆయన స్థానంలో సత్యకుమార్ ను నియమించేందుకు అన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సోము వీర్రాజు అసంతృప్తికి గురి కాకుండా వేరే ప్రదాన్యత కలిగిన పదవిలో ఆయనకు స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రక్షాళన చేస్తున్న బీజేపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Also Read:విజయ్ ‘లియో’లో ఆర్ఆర్ఆర్ స్టార్!

- Advertisement -