తెలంగాణలో ఎవరూ ఆకలితో ఉండకూడదు..

228
somesh kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. హైదరాబాద్ లోని టోలీ చౌకి ప్రాంతంలో పర్యటించి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ,ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు సోమేశ్ కుమార్.

జీహెచ్ఎంసి లిమిట్స్ లో గతంలో 120 అన్నపూర్ణ సెంటర్స్ ఉండేవి..కానీ ఇప్పుడు మూడు వందలు ఏర్పాటుచేశామని తెలిపారు. మరో 50 సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. పేదలకు అన్నపూర్ణ మీల్స్ ద్వారా 2 లక్షల వరకు రోజు భోజనం పెడుతున్నామని తెలిపారు.

ఇక భోజనం పెట్టె సమయం ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటలకే స్టార్ట్ అవుతుందన్నారు. ఇంకా ఎక్కడైనా భోజనం కావాలంటే ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. భోజనం ఇంకా ఏదైనా కాలనీ లో కావాలంటే జీహెచ్ఎంసి వెబ్సైట్ లేదా 2111111 కి ఫిర్యాదు చేయాలన్నారు. నగరంలోని ప్రతి ఏరియా సర్కిల్ లో రెడీమేడ్ సైతం అందుబాటులో ఉంటుందన్నారు.

- Advertisement -