ఈ- ఆఫీస్‌తో పాలనలో పారదర్శకత:సీఎస్ సోమేశ్‌ కుమార్

270
somesh kumar
- Advertisement -

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆశయాల కనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము పెంపొందించడానికి e-office system ప్రవేశపెట్టబడింది. 6 శాఖలలో e-office system ప్రారంభం సందర్భంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అతి కొద్ది కాలంలోనే అధికారులు కష్టపడి e-office system అందుబాటులోనికి తీసుకొని వచ్చినందుకు అధికారులను అభినందించారు.

ఈ రోజు నుండి ఈ క్రొత్త విధానం ద్వారా 1600 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు. సాధారణ పరిపాలనా శాఖ, అబ్కారీ, మద్య నిషేధ శాఖ, వాణిజ్య పన్నులు, ప్రధాన కమీషనర్, భూ పరిపాలన శాఖలు ఈ విధానం లో ముందoజలో ఉన్నందుకు అభినందించారు. ఇతర శాఖలు కూడా e-office సిస్టం క్రింద పనిచేసేలా చూడాలని ఆదేశించారు.

ఈ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. దీని వల్ల అనవసర కాగితాల పని మరియు చాలా సమయం ఆదా అవుతుందని అన్నారు. ప్రతి ఫిర్యాదు, దరఖాస్తుకు జవాబుదారీతనమునకు ఈ విధానము చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

e-office సిస్టం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఫైళ్ళు పరిష్కరించ బడతాయి. ఈ విధానం కాగితరహితంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా కాగితాల తో పనిలేకుండా సురక్షితంగా పనిచేయడానికి వీలు అవుతున్నందున అధికారులు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -