- Advertisement -
టీపీసీసీ రేవంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రేవంత్ వైఖరికి వ్యతిరేకంగా పార్టీని వీడగా తాజాగా ఆయన కీలక అనుచరుడు సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు సోమశేఖర్ రెడ్డి.
గ్రేటర్‌లో రేవంత్ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సోమశేఖర్ రెడ్డి. ఆ పార్టీకి ఉన్న ముగ్గురు కార్పొరేటర్లలో ఈయన ఒకరు. ఇక ఉప్పల్ టికెట్ ఆశీంచిన ఆయన కొద్దికాలంగా స్ధానికంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఉప్పల్ టికెట్ దక్కని నేపథ్యంలో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇది రేవంత్‌కు నిజంగా షాకే. సోమశేఖర్ రెడ్డి బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లు సమాచారం.
Also Read:ఆకట్టుకుంటున్న..’మా ఊరి పోలిమేర 2′
- Advertisement -