ఎమ్మెల్యేల కొనుగోలు..న్యాయం గెలిచింది

167
- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయాలని భావించిన బీజేపీకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సోమ భరత్. ఎమ్మెల్యేల కొనుగోళ్ల పై స్టే ఎత్తివేసి పోలీసులు దర్యాప్తు చేయవచ్చు అన్న హైకోర్టు తీర్పు పై స్పందించిన ఆయన…న్యాయం గెలిచిందన్నారు.

హైకోర్టు ఈ తీర్పు ద్వారా నిందితుల విచారణకు మార్గం సుగమం చేశారని…నిందితులతో పాటు ఉన్న అనేకమంది భాద్యులను కూడా విచారించడానికి వీలవుతుందన్నారు. ఈ తీర్పు ద్వారా దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ కలిగిందన్నారు. కేసు దర్యాప్తు చేయడం ఆపడం అనేది ఉండదు హైకోర్టు కూడా ఈ దర్యాప్తు కి ఏ అడ్డంకులు లేకుండా అవకాశం కల్పించిందన్నారు. సీబీఐ కి అప్పగించాలని బిజెపి అంటుంది సీబీఐకి అప్పగించడానికీ ఈ కేసులో ఏమాత్రం అవకాశం లేదు అన్నారు.

సీబీఐ బిజెపికి జేబు సంస్థ వారి కనుసన్నల్లోనే నడుస్తుందన్నారు. సీబీఐని అడగడం అర్థ రహితం…కేంద్రం సిబిఐ ,ఈడి ని ఎలా వాడుతుందో అందరికి తెలుసు అన్నారు. సిబిఐ ఎలా పడితే అలా రావడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో రావాలన్నారు. చేసిన నిర్వహకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ కేసులో నుండి తప్పించుకునేందుకు సిబిఐ ని అడుగుతున్నారన్నారు. తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు సిబిఐ ని అడగాల్సిన అవసరం లేదన్నారు.

మన రాష్ట్ర పోలీసులు ఎన్నో కేసులను ఛేదించారు…రాష్ట్ర పోలీసులకు ఉన్న పరిజ్ఞానం సీబీఐకి ఉండదన్నారు. సీబీఐ ఎంక్వరి అంటే బిజెపి ఎంక్వయిరి అన్నట్టేనని…అధికారం మా చేతులో ఉంది ఏమైనా చేయొచ్చు అని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయచ్చు అని బీజేపీ భావిస్తుందన్నారు. దేశములో నిరుద్యోగము,అవినీతి తాండవం చేస్తున్నాయి…దర్యాప్తు సంస్థలను చేతులోపెట్టుకొని ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు అన్ని రాష్ట్రాలు దీన్ని గమనించాలి అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -