రోహిత్‌తో ఏకాంతంగా గడిపా:సోఫియా

217
rohith sofia
- Advertisement -

టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది మోడల్ సోఫియా హయత్. తాను రోహిత్‌ ప్రేమించుకున్నామని ఏకాంతంగా కూడా గడిపామని బాంబు పేల్చింది. త్వరలో తన జీవితంపై ఓ పుస్తకం రాయాలనకుంటున్నానని అందులో రోహిత్‌తో తనకున్న ఎఫైర్ గురించి ప్రస్తావించనున్నట్లు చెప్పింది.

2012లో రోహిత్ తో డేటింగ్ చేశానని, లండన్ లోని ఓక్లబ్ లో తొలిసారి ఇద్దరం ఏకాంతంగా కలిశామని తెలిపింది. తన స్నేహితురాలి ద్వారా రోహిత్‌ను కలిసానని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని వెల్లడించింది. తాను క్రికెట్‌ను ఎక్కువగా చూడనని, అందుకే రోహిత్ క్రికెటర్ అన్న విషయం అప్పటి వరకు తనకు తెలియదని పేర్కొంది.

Image result for sofia rohith

మీడియాకు తెలియనంత వరకు తమ ప్రేమ వ్యవహారం బాగానే సాగిందని, ఆ తర్వాత మీడియా ప్రశ్నించడంతో రోహిత్ తప్పించుకున్నాడని సోఫియా పేర్కొంది. సోఫియాతో రోహిత్ సన్నిహితంగా ఉన్న ఫోటో అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.ఈ వార్తలపై రోహిత్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

- Advertisement -