ఎంపీగా పోటీచేస్తా..ఖర్చులకు రుణం ఇవ్వండి

216
venkata narayana
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీలన్ని అభ్యర్ధుల ఖరారు విషయంలో బిజీగా ఉన్నాయి. ఇక టిక్కెట్లు ఖరారైన నేతలు డబ్బును సమకూర్చుకునే పనిలో ఉన్నారు. చాలా మందికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని ఉంటుంది కానీ డబ్బు ఉండదు. అచ్చం ఇలాంటి పరిస్ధితే ఎదురైంది ఓ సామాజిక కార్యకర్తకు . అయితే తాజాగా ఎన్నికల్లో పోటీ చేస్తాను అని కోరుతూ ఓ సామాజికి కార్యకర్త కెనరా బ్యాంకు లో దరఖాస్తూ చేసుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని..ఎన్నికల ఖర్చు కోసం తనకు రుణం మంజూరు చేయాలని దరఖాస్తూ చేశారు కె. వెంకటనారాయణ.

అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన వెంకటనారాయణ నల్లకుంటలో నివాసం ఉంటాడు. తాను సికింద్రబాద్ ఎంపీ గా పోటీ చేయాలనుకుంటున్నానని ఎన్నికల ఖర్చు కోసం రూ. 5 లక్షల రుణం ఇవ్వాలని కోరారు. తాను గత 15 ఏళ్లుగా అవినీతిపై ప్రత్యక్ష ఉద్యమాల ద్వారా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతి కుంభకోణాలను వెలికితీసి అవినీతిపరులను కోర్టుకు లాగుతున్నానని వివరించారు.

అన్ని రంగాలవారికి ఆర్బీఐ రుణాలు ఇస్తోందని.. అలాగే సామాన్యులు, సామాజిక కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రుణాలు ఇవ్వాలని డియాండ్ చేశారు. తన సేవలను గుర్తించిన తమిళనాడు మాజీ గవర్నర్ తనను సన్మానించి పురస్కారం కూడా అందజేశారని తెలిపాడు. 2014లో అంబర్ పేట నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వెంకట నారాయణ ఎన్నికల ఖర్చు కోసం బిక్షాటన కూడా చేశారు.

- Advertisement -