మీరు ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటూ.. ఆన్‌లైన్ లోన్లకు అప్లై చేస్తున్నారా..? ఆన్‌లైన్‌లోనే ఏ బ్యాంక్ ఎంత తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుందని అదే పనిగా వెతుకుతున్నారా.. అయితే మీపై నిఘా ఉందని తెలుసా… ఇన్ స్టా పైసా, గోపే సెన్స్, క్యాష్ కేర్, వోట్ క్యాష్ లాంటి ఆన్‌లైన్ పెట్టుబడి సంస్థలే కాకుండా క్రెడిట్ మంత్రి, బ్యాంక్‌బజార్.కామ్ ఎట్సెట్రా ఆన్‌లైన్ మార్కెట్‌లు మీ మీద ఓ కన్నేసి ఉంచుతాయట.సోషల్ మీడియాలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందన్న విషయాలపై సమాచారం సేకరిస్తారట.
ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ళలోపు వయసువాళ్ల ట్రాక్ రికార్డ్ చెక్ చేసే పనిలోపడ్డారట. ఈ ఏజ్ గ్రూప్ గతంలో లోన్లు తీసుకున్నారా? తీసుకున్నవి తిరిగి చెల్లించారా? లోన్ చెల్లించాలన్న ఎస్.ఎం.ఎస్‌లకు వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంది. ఫోన్‌కాల్‌కు సమాధానమిచ్చే తీరెలా ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందన్న విషయాలపై సమాచారం సేకరించి వాళ్ళకు కొంత స్కోర్ వేస్తారు. అంతేకాకుంగా లోన్ కోసం అప్లై చేసిన సదరు వ్యక్తి గూగుల్‌లో తమ బ్యాంక్ వ్యవహారాల గురించి ఎన్నిసార్లు వెబ్‌సైట్‌ను విజిట్ చేసింది, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడా, జూదగాడా ఎట్సెట్రా సమాచారం సేకరించి వచ్చిన స్కోరు మంచిగా ఉంటేనే బ్యాంకులు లోన్ ఇచ్చే సంగతి ఆలోచిస్తాయట. అంటే అలవాట్లు మనిషికి ఒక వ్యక్తిత్వాన్నిస్తాయి. ఇపుడు అదే అలవాట్లు లోన్లు కూడా తెస్తాయన్నమాట.