సాకర్ ఫీవర్‌తో ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. తమ జట్టు గెలిచినా,గోల్ కొట్టినా ఆ ఆనందాన్ని ఫేస్‌బుక్‌లో Goal అని పోస్టు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. టోర్నీ ప్రారంభమై రోజులు గడుస్తున్న కొద్దీ సాకర్ ఫీవర్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
సాకర్ జోష్‌ను క్యాచ్ చేసుకున్న ఫేస్ బుక్ మరింత మజాను అందించేందుకు సిద్ధమైంది. మీరు Goal గురించి పోస్ట్ చేస్తే స్పెషల్ అట్రాక్షన్ ఉండేలా అక్షరాల రంగు ఆకుపచ్చలోకి మారేలా సపరేట్ థిమ్ డిజైన్ చేసింది. అంతేగాదు ఆ అక్షరాలను టచ్ చేస్తే మీ మొబైల్ స్క్రీన్ సాకర్ గ్రౌండ్‌లా మారిపోతుంది. అయితే Goal అని రాస్తే ఈ ఎఫెక్ట్ కనిపించదు. Goaaal, Goaaaal అని రాయాల్సి ఉంటుంది. ఎన్ని A లు రాసినా ఫర్వాలేదు.
ఇక ఫిఫా ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం లభించింది. టోర్ని మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారిక బంతిని స్కూల్స్ స్టూడెంట్స్ మైదానంలోకి తీసుకువస్తారు .ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 64 మంది విద్యార్థులను ఎంపిక చేయగా భారత్‌కు చెందిన కర్ణాటకకు చెందిన రిషి తేజ్,తమిళనాడుకు చెందిన తనియా జాన్ ఉన్నారు. సోమవారం బెల్జియం-పనామా మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు రిషి తేజ్ అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువచ్చాడు. ఫిఫా ప్రపంచకప్‌లో ఇలా అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువెళ్లిన తొలి భారతీయుడిగా రిషి చరిత్ర సృష్టించాడు. తనియా జాన్ ఈ నెల 22న బ్రెజిల్-కోస్టారికా మధ్య జరిగే మ్యాచ్‌కు జాన్ బంతిని అందివ్వనున్నాడు.